పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/259

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గండికోట

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 72

పటము - 7

రెండు కొండలమధ్య పినాకినీ నది.

బిగింపబడియున్నది. ఈ కట్టడమిపుడు బాటసారుల వసతి గృహముగా ఏర్పాటు చేయబడియున్నది. ఇందు కొన్ని శిలావిగ్రహములు కలవు.

ఉత్తర దిశగల గుట్టపై రంగనాథుని దేవాలయ మొకటి కలదు. దీనికి ప్రాగ్దక్షిణోత్తర దిశలలో ద్వారములు కలవు. లోపలనున్న కల్యాణమండపము, పాకశాల, యాగశాల, ఉత్సవశాల, అలంకారశాల, ముఖ మండపము మున్నగునవి ఆకర్షకములై యున్నవి. ఈ ఆలయమున కెదుట ఒక యెత్తయిన స్తూపమువంటి భాగముకలదు. అది శత్రునిరీక్షకస్థానము. తూర్పున కరిగినచో కోటబురుజులు, సేనానివేశములు గోచరించును. చీకటి పాతరలు, మూడంతస్తులుకల చార్‌మీనారు కలవు. దక్షిణభాగమున నొక కోనేరు కలదు. అందలి నీరు ఎఱ్ఱని రంగుతో నుండును. ఆ జలము దోసిటితో దీసికొనిన రంగు కనబడదు. ఇంకను దక్షిణమున కోటద్వారమొకటి కలదు. అటనొక ఎత్తయిన మిద్దె యున్నది. దానిలో మందుగుండు సామానులు, మారణాయుధములు దాచుచుండిరి. కొండయొక్క కొనభాగమున పోవబోవ ఈశాన్య భాగపుజివర ఊయల లూగుటకయి నిర్మితమయిన సౌధమొకటి కలదు. అందు గండికోట నవాబు తనప్రియురాండ్రతో నుయ్యెల ఊగుచుండెడివాడట. ఆ నివేశనిర్మాణమే ఒక అద్భుత విధానము. అచ్చట ఊగుట ఒక సాహస కార్యమే అట !

తూర్పునగల దర్వాజానుండి ముందునకు తూర్పుగా వెడలినచో మరియొక దర్వాజా కనిపించును. దీనికి ముందు భాగమున నొక పెద్ద మైదానముకలదు. అందు

216