విజ్ఞానకోశము - 3
గండికోట
గట్టించి, అందు వాటిని ప్రతిష్ఠింప వలయుననియు ఆనతిచ్చి, అంతర్థానము నొందెను. వారు మేల్కొని అచ్చట త్రవ్వించి చూచిరి. కలలో నుడివిన రీతిగా నాలుగు విగ్రహములు కనబడెను. వారు వాటిని తీసికొని వెంటనే తమ సీమ కరిగిరి. ఆ యాదేశానుసారము శేషగ్రంధిపుర మను పేరు గల 'పామిడి ' యందు పద్మనాభస్వామిని, గుత్తియందు మాధవస్వామిని, ఒంటిమిట్టలో కోదండ రామస్వామిని, గండికోటలో మాధవస్వామిని ప్రతిష్ఠించి, అంగరంగ వైభవములు సక్రమముగా ఆ మూర్తులకు జరుగునట్లు అనేక దానములను, అగ్రహారములను, భూదానములను కావించిరి. ఈ దేవాలయముల ముందట గోపురములను గూడ నిర్మించిరి.
ఇటీవలనేదొరికిన శాసనములను బట్టి వరంగల్లురాజు లగు కాకతీయులు వల్లూరు మొదలు కడప జిల్లా వరకు పాలించినట్లు తెలియు చున్నది. ప్రతాపరుద్రుని కొడుకు అంబదేవుడు వల్లూరు పాలకుడుగా నుండెను క్రీ.శ. 1309 లో మహమ్మదీయుల దండయాత్రయు, విజయనగర రాజ్యస్థాపనయు ఘటిల్లెను. హరిహరరాయలును, బుక్క రాయలును ఓరుగల్లునుండి బయలుదేరి వచ్చిన సోదరులు. వీరే విజయనగర రాజ్యస్థాపకులు. ఒకటవ బుక్కరాయలు శా. శ. 1297 (క్రీ. శ. 1375–1376) లో పాలకుడై యున్నట్లు కలదు. విజయనగరకాలమున గండికోటసీమ ప్రకృతపు
చిత్రము - 68
పటము - 3
గండికోట తూర్పు దర్వాజా. ఈ మార్గము జమ్ములమడుగునకు వెళ్లును. ఈ దర్వాజా
ముందుభాగమున, లోపలిభాగమున - రెండుప్రదేశములయందు వెయ్యిమంది సైనికులు
నిలుచు ప్రదేశముగలదు. ఈ దర్వాజా తలుపులు అర్గళములు; సన్నివేశము విచిత్రముగ నున్నది.
చిత్రము - 69
పటము - 4
నవాబు గోవధ చేసిన మాధవరాయస్వామి దేవాలయ ముఖమండపము.
రెండు ప్రక్కల ఏనుగులు గలవు.
213