పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/255

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గండికోట

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 66

పటము - 1

గండికోట యందు కొండక్రింది భాగము

అక్కడక్కడ శిథిల దృశ్యములు, పలవృక్షములు, కేదారములు కలవు

చిత్రము - 67

పటము - 2

కోటలోనికి వచ్చు ద్వారము (పినాకినిలో నుండి యెక్కి వచ్చు భాగము)

పడమటి దర్వాజా రెండవ కక్ష్యద్వారము శత్రువులను గమనించుట కేర్పరుపబడినది.

ఎడమభాగమున ఆశ్వశాలలు, భటుల గృహములు కలవు.

జొకడు నివసించుచుండెను. అతడు కాకతీయు డని తెలియుచున్నది. ఆతడు తన పరిపాలనాకాలమున ప్రక్క నున్న కొండలలో వేటకొరకు ఉత్సాహముతో నేగి, ఆ ప్రదేశముల సంచరించుచు, పినాకినీనదీ పరిసరమున ఒక తావును కాంచెను. అచటి కొండలు, లోయలు, చట్టులు మున్నగువాటిని గాంచి అది శత్రు దుర్భేద్య మగు తావని అతడు గుర్తించెను. దైవజ్ఞులు శాస్త్రములను పరిశీలించి ఆ తావున కోటను గట్టించినచో అమోఘముగ నుండునని ఆతనికి తెలిపిరి. వారి ఆనతి చొప్పున కాకరాజు సంతృప్తుడై అచట నొక బలిష్ఠమగు కోటను గట్టించెను. తగిన అంగముల నేర్పరచి ఆ కోటకు గండికోట యని నామకరణ మొనర్చెను. ఆతడు ఆ కోటయందే నివసించి, ఆ సీమను నిర్భయముగ పరిపాలించెను.

శాలివాహన శక . 1297 (క్రీ. శ. 1375) లో పుణ్యాత్ము లగు హరిహర, బుక్క రాయలు మహావీరులై విజయనగరమును గట్టించి, యందుండి పరిపాలనము గావించుచు కాశీయాత్ర కేగి, గంగానదీ జలమును బిందెతో తీసికొని 'స్వ' రాజ్యమునకు వచ్చుచు, మార్గమధ్యమున గోదావరి నదియందు స్నాతులు కాదలచి, అందలి సైకతములందు విడిదిచేసిరి. వారికి కలలో దేవుడు బ్రాహ్మణ రూపమున కనిపించి అచ్చట భూమిలో త్రవ్వి వెదకినచో విగ్రహములు దొరకగలవనియు, వాటిని తీసికొనివెళ్లి ఆలయమును

212