పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/244

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖమ్మముజిల్లా

తాలూకాలు : ఈ జిల్లాలో 7 తాలూకాలు కలవు.

1. ఖమ్మముమెట్టు తాలూకా

విస్తీర్ణము 591.36 చ. మై.
గ్రామములు 156
పట్టణములు 1
జనాభా 2,35,078
పురుషులు 1,19,882
స్త్రీలు 1,15,196
జనసాంద్రత 398

2 మధిర తాలూకా

విస్తీర్ణము 771.84 చ. మై.
గ్రామములు 157
పట్టణములు 2
జనాభా 1,70,661
పురుషులు 88,123
స్త్రీలు 82,538
జనసాంద్రత 227

3. ఎల్లందు తాలూకా

విస్తీర్ణము 754.93 చ. మై
గ్రామములు 49
పట్టణములు 3
జనాభా 1,19,367
పురుషులు 60,794
స్త్రీలు 58,573
జనసాంద్రత 158

4. పాల్వంచతాలూకా

విస్తీర్ణము 1,295.36 చ. మై.
గ్రామములు 69
జనాభా 1,31,310
పురుషులు 68,035
స్త్రీలు 63,275
జనసాంద్రత 101

5. బూర్గుంపహడు తాలూకా

విస్తీర్ణము 568.06 చ. మై.
గ్రామములు 42
పట్టణములు 1
జనాభా 43,590
పురుషులు 22,255
స్త్రీలు 21,335
జనసాంద్రత 77

6. భద్రాచలం తాలూకా

విస్తీర్ణము 911 చ. మై.
గ్రామములు 327
జనాభా 77,620
పురుషులు 39,016
స్త్రీలు 38,604
జనసాంద్రత 85

7. నూగూరు తాలూకా

విస్తీర్ణము 593. చ. మై
గ్రామములు 146
జనాభా 35,366
పురుషులు 17,880
స్త్రీలు 17,486
జనసాంద్రత 60

ఈ జిల్లా ప్రధాన స్థానము ఖమ్మము పురము. దీని ప్రాచీననామము కంబముమెట్టు. తరువాత ముస్లిముల నోటిలో ఖమ్మము మెట్టు అయినది. ఇప్పుడు సర్కారువారి ఆదేశానుసారము “ఖమ్మము" గా వ్యవహరింపబడుచున్నది. ఖమ్మము పురము సముద్ర మట్టమునకు 315 అడుగుల ఎత్తున నున్నది.

పర్వతములు : పాకాల - సింగరేణి నుండి చిన్నగుట్టల వరుస యొకటి బయలుదేరి ఆగ్నేయదిశ యందున్న అశ్వారావుపేట వరకు పోయి, దిగువ గోదావరిలోయకు సరిహద్దుగా నుండును. జిల్లా యంతటను చుక్కల వలె చిన్న చిన్న గుట్టలు చెదురుగా నున్నవి. తూర్పు కనుమల పర్వతములు సముద్రతీరము నుండి క్రమముగా పైకి లేచుచు నూగూరు, భద్రాచలము తాలూకాలలో వ్యాపించియుండును.

నదులు : ఈ జిల్లాలో ముఖ్యమైన నదులు మునేరు, పాలేరు, కిన్నెరసాని, వై రా అనునవి. మునేరు పాకాల చెరువు నుండి బయలుదేరి వై రాతో కలిసి 96 మైళ్లు హిప్రంచి కృష్ణలో సంగమించును. పాలేరునది వరం

201