పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/225

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖననశాస్త్రము

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 53

పటము - 4

దూరము, పరిస్థితులనుబట్టి తిరోగమించుచున్న ముఖాకృతుల యొక్క పొడవును నిర్ణయించ గలుగును. ఈ మార్గములు సరిహద్దును చేరగానే E, E, అను మార్గముల వలన వెలుతురు, గాలి మున్నగు సదుపాయముల కొరకై F గుర్తువద్ద పెట్టబడిన కోత (slit) లో మరల కలుపబడుచున్నది. g. h అను గుర్తుగల త్రవ్వకము జరుగు చున్న ముఖద్వారము బహిర్గతము చేయబడును. అనంతరము ఈ భాగము పటములో చూపిన విధముగా a1, a2, అను సమతల ప్రాంతమునకు తరలించబడును.

ధాతు ఖనిజముల (Metal) త్రవ్వకపు విధానము : ధాతు ఖనిజములను త్రవ్వి వెలికితీయు విధానము కూడ భూగర్భమునందున్న ఖనిజములయొక్క లక్షణములమీద ఆధారపడియుండును. ఉదాహరణమునకు 'ప్లేసర్ డిపాజిట్' (Placer deposit) 'వెయిన్ డిపాజిట్ ' (Vein deposit) అనియు రెండు తరగతులు కలవు. ఈ రెండింటికిని వేర్వేరు ఖనన విధానము లున్నవి.

ప్లేసర్ డిపాజిట్లు : సిమెంటువలె అతుకుకొని యుండని గులక రాళ్ళు, రకరకములైన యిసుకలు, బంకమన్ను లక్షణములు కలిగిన అవశేషములు ప్లేసర్ డిపాజిట్లలోని భాగములు, ఈ పదార్థములు దాదాపు భూమియొక్క ఉపరితలము మీదనే లభించును. నీటిలో క్షాళనవిధానము ననుసరించి ఈ పదార్థములు బాగుచేయబడును. ఈ పదార్థములలో జనిజ భాగములు సాధారణముగా స్వల్పముగ నుండును. అయినను వీటిని వెలికితీయు విధానము ఎక్కువ ధనవ్యయముతో కూడుకొన్నది కాదు కావున, స్వల్పమాత్రపు ఖనిజము దొరకినను దానికొరకు కృషిచేయుట లాభదాయకమే యగును. దీనిని సేకరించుటకు భూమియొక్క ఉపరితలము మీదనే ఇతర కార్యకలాపమంతయు జరుగును.

వెయిన్ డిపాజిట్లు (Vein Deposits) : ఈ తరగతికి చెందిన ఖనిజసంచయములందు పొడవు, లోతుకంటె మందము, వెడల్పు తక్కువగా నుండును. వేర్వేరు ప్రదేశములందు దాదాపు 100 అడుగుల సమానాంతరములతో సమతలమును నిర్మించుట (driving levels) వలనను, ఈ అంతరముల యందు గల అనేకములయిన ఉన్నత ప్రదేశములను (rises) గవాక్షములను (winzes) కలుపుటవలనను, ఈ తరగతికి చెందిన ఖనిజ పదార్థములను త్రవ్వి బయటికి తీయసాధ్య మగును. ఈ కార్య విధానమును డెవలప్ మెంట్ (Development) అందురు. ఈ డిపాజిట్లు గల ప్రాంతమునకు విలువ కట్టుటకు అచట లభ్యమగు నమూనాలను పరిశీలించ వలసి యుండును. ఈ పరిశీలనము వలన విలువైన ఖనిజములు గొప్ప పరిమాణములో లభ్యము కాగలవని తేలినయెడల 'స్టాపింగ్ ' అను ప్రక్రియవలన మధ్యనున్న ముడిఖనిజమును వెలికి తీయుదురు. (5వ పటము చూడుడు.)

చిత్రము - 54

పటము - 5

ముగింపు : ఖనిజములు వ్యయశీలమగు ఆస్తి (Wasting asset) యనదగును. భూగర్భమునుండి ఒకమారు

182