పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/224

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖననశాస్త్రము

చిత్రము - 51

పటము - 2

a, a - b, b అను రెండు జంటమార్గములు సమకోణాకృతిలో నిర్ణీతమైన పరిమాణమును, ఆకృతిని పొందు విధముగా విభాగములు చేయబడును ఈ విభాగము లేక మండలము గుండా C C C అను మూడు మార్గములు నిర్మించబడును. ఈ మూడు మార్గములును d d అనువానిచే కలుపబడును. ప్రధానమార్గములైన a a ల యొక్క భారమును d d అను స్తంభములు మోయుచుండును. విభాగములను, మండలములను విడదీయుటకై సి. డి (c, d) అను మార్గములనుండి బార్డులు (Bords). స్తంభములు (Pillars) నిర్మింపబడును త్రవ్వకపు కార్యక్రమ మంతయు ముగిసిన పిదప సాధారణముగా g g అను మండలము (panel) యొక్క ఇరువైపుల కొనలనుండి స్తంభములను పడగొట్టు కార్యక్రమము ప్రారంభింపబడును. స్తంభపు వరుసలు నన్నిటిని ఒకదాని వెంట నొకటి d అను మార్గముతో అంతమగునట్లు పడగొట్టుదురు. దీని ఫలితముగా పటములో చూపబడినట్లు G O A F అను భాగము మాత్రము వెనుక మిగిలిపోవును.

పొడవైన గోడను నిర్మించు విధానము (Long wall method): (1) పురోగమనము (Advancing); (2) తిరోగమనము (Retreating).

పురోగమనము : కొంత దూరములో నున్న గోయినుండి పలుదిశలకు మార్గములు నిర్మించుటవలన బలమైన ఒకే స్తంభము నిలిచిపోవును. జంటమార్గముల మధ్యగుండా (between Pairs of drivages) దీర్ఘాకారమున నున్న గోడలను పోలిన ముఖాకృతులు. పై నుదహరించిన మండలముయొక్క సరిహద్దు దిశగా బహిర్గతము లగును. అట్లు బహిర్గత మగు సమయములో 'గోఫ్' అను భాగము క్రమబద్ధముగా పూరించబడును. దీని ఫలితముగా భూగర్భములో అవసరమైన గాలి, వెలుతురు లభ్యము కాగలదు. (3 వ పటము చూడుడు.)

తిరోగమనము : ఈ విధానమున, రోడ్డుమార్గములు బొగ్గు కేంద్రీకరించబడియున్న ప్రాంతము గుండా, నిర్ణీతమయిన మండలములయొక్క

చిత్రము - 52

పటము - 3

సరిహద్దులవరకును నిర్మింపబడును. సరిహద్దును చేరినంతనే ముఖ్యమైన మార్గములు అడ్డముగా నిర్మింపబడిన ఇతర మార్గములతో కలుపబడును. (4వ పటము చూడుడు) పటములో సూచించబడినట్లు. బొగ్గు కేంద్రీకృతమై యున్న భాగములో b, b అను గుర్తు గల కోతలు లేక గండ్లు a1, a2, అను మట్టములను కలుపుచున్నవి. వీటి ననుసరించి C, C అను ఇతర జంటమార్గములు నిర్మింపబడును. తిరిగి ఈ జంట మార్గములు d, d అను గండ్లచే కలుప బడును. C, C అను జంటమార్గముల మధ్యనుండు

181