పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/190

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3

అడ్డముగను రెండుఅడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతుగల కాలువలను త్రవ్వెదరు. ఈ కాలువలలోనికి వదలబడిన నీరు నిలువయుండి, పై యెత్తున నుండు మడు లను క్రమముగా తడుపును.

5. బేసిన్ ఇర్రిగేషన్ : పండ్ల తోటలలో వృక్షముల చుట్టును వలయాకారములో పాదులను తయారుచేసి, కాలువల మూలమున వాటిలోనికి నీరును ప్రవేశ పెట్టె దరు. తోటనంతయు జలమయము చేయరు. తరచుగా నీరు అవసరమైన లేదోటల పెంపకమునకు ఈవిధానము ముఖ్యముగా ఉపయోగపడును.
భూమి అడుగుభాగమునుండి నీటి పారుదల: ఈ నీటి పారుదల విధానములో భూమి యొక్క ఉపరితలము నుండి ఒక అడుగు లోతున 3-5 అడుగులకు ఒక్కొక్కటి చొప్పున 'పోరస్ ' (సూక్ష్మమైన రంధ్రములుగల) గొట్టము లను సమాంతరము (Parallel) గా అమర్చెదరు. జలా శయము నుండి ఏర్పాటు చేయబడిన ముఖ్యమగు గొట్ట ములకు ఈ చిన్న గొట్టములు కలుపబడును. ఈ కలుప బడిన చోట్లు (joints) అతికించబడవు. ఈ గొట్టముల ద్వారా స్రవించు జలము మొక్కల యొక్క మూలము నకు చేరుకొనును. ఈ విధానము వలన నీరు ఎంతో పొదుపగును. కాని ఇది ఎంతో వ్యయముతో కూడిన విధానమగుటచే సామాన్యమైన పేద రైతులు ఈ పద్ధతిని అనుసరింప లేరు. ఊర్ధ్వభాగము నుండి నీటి పారుదల: ఈ పద్ధతి ననుస రించి గుండ్రముగా పరిభ్రమించు రంధ్రములుగల గొట్ట ములు భూమికి ఎత్తుగా పై భాగమున అమర్చబడి యుండును. ఒత్తిడి ఫలితముగా నీరు ఈ గొట్టములద్వారా సరఫరా చేయబడును. నీటియొక్క త్వరిత గమనము వలన, పై పేర్కొనబడిన రంధ్ర భాగములు గుండ్రముగా తిరుగుచు పై రుమీద సన్నని వర్షపు జల్లువలె నీటిని వదలును. ఒక్కొకప్పుడు రంధ్రములు గలిగిన ఈ గొట్ట ములు వరుసగా పాతబడిన స్తంభముల ఆధారముతో 30 నుండి 40 అడుగుల దూరమున నిర్మింపబడును. తీవ్ర మైన ఒత్తిడితో నీటిని సరఫరా చేయుటవలన, గొట్టముల మూలముగా నీరు వర్షపు జల్లువలె పెరుమీద పడును. ఈ విధానము చాల వ్యయశీలమైనట్టిది. దీనివలన పంట > 147 క్షేత్రపాయనము - మురుగుపారుదల పొలముచే అత్యధిక పరిమాణములో నీరు ఉపయోగింప బడును. కాఫీ, పుగాకు, కూరగాయల తోటలకు ఈపద్ధతి వలన అధిక ప్రయోజనము కలుగును. మురుగు పారుదల : ఎందుకును పనికిరాని నీటిని వెలుపలికి పంపివేసి, ఆ నీటి సహాయముతో కొన్ని రకము లైన పంటలను పండించుట యే ఈ మురుగునీటి పారుదల విధానముయొక్క ముఖ్యోద్దేశము. కొన్ని రకములైన పంటలు పండుటకు అవసరమైన ఆహార పదార్థములు ఈ మురుగునీటి యందు లభించగలవు. మురుగునీటి పారుద లకు ఇసుక, గులక రాయితో కూడుకొన్న భూములు ఎక్కువ అనువుగా నుండును. ఇట్టి నేలలందు నీరు వెంటనే సులభముగా ఇంకిపోవును. బంకమట్టి భూములు మురుగునీటి పారుదలకు పనికిరావు. కొంతవరకు నీటి పారుదల జ పిదప జంతువృక్ష సంబంధమగు తుక్కుపదార్థముతో బంకమట్టిలోని రంధ్రములు పూడి పోయి నీరు ఇంకదు. కనుక పైరుల పెరుగుదల నిలచి పోవును. నీటి పారుదలను సమర్థవంతముగా, పొదుపుగా నిర్వ హించుట : నీటిపారుదల విధానమును సమర్థవంతముగను పొదుపుగను నిర్వహించుటకు ఈ క్రింది చర్యలను అవలం బించవలెను :
1. భూమి ఉపరితలమును, సహజ సిద్ధముగా నున్న ఏటవాలు ననుసరించి మెత్తగా, చదునుగా తయారు చేయవలెను.
2. భూమి స్వభావమునకు తగినట్లుగా పండింపదలచు కొన్న పై రులకు అనువగునట్లు నీటిపారుదల విధానమును నిర్ణయించవలెను.
3. నేలను కోత కోయకుండా, పైరుకు చాలినంత నీటిని పుష్కలముగా సరఫరా చేయునట్లు కాలువల త్రవ్వకమును ఏర్పాటు చేయవలెను.
4. భూమిని లోతుగా, చక్కగా దున్నవలెను. నీరు భూమిలోనికి పూర్తిగా చొచ్చుకొని పోవునట్లు మట్టిగడ్డ లను మెత్తగా చితుకగొట్ట వలెను.
5. భూమిని తరచుగా దున్నుచు, కలుపును నిర్మూ లము చేయుచుండవలెను. పై రుమీద పరిశుభ్రమైన గాలి వీచునట్లు ఏర్పాటు చేయవలెను.