పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/158

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కోలారు


చిత్రము - 22

పటము - 1

కోలారు బంగారుగనిలో గని అంతర్భాగమున చలన శకటము

—Courtesy: Director of Publicity and Information Govt. of Mysore.

కోలారు పట్టణములో చోళుల కాలమునాడు ప్రతిష్ఠితమైన దేవాలయములు కలవు. ఇందుకు నిదర్శనముగా ఆనాటి శాసనములు ఆ దేవాలయాలలో కనిపించుచున్నవి. వాటిలో ప్రసిద్ధమైనది కోలారమ్మ దేవస్థానము. దీనిని రాజేంద్ర చోళుడు ప్రతిష్ఠించినాడు. కోలారమ్మ విగ్రహమునకు సమీపములో ఒక రంధ్రం కనిపించుచున్నది. అందులోనుండి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ పంచమినాడు ఒక తేలు బయటికి వచ్చుచుండునట!

చిత్రము - 23

పటము - 2 కోలారు బంగారుగనిలోని కూపకము —Courtesy: Director of Publicity and Information Govt. of Mysore.

తేలు కుట్టినచో, ఈ దేవతను ఆరాధించిన తోడనే బాధ నివారణము కాగలదను ప్రతీతి ఇప్పటికిని కలదు. కోలారుదగ్గర నున్న పర్వతము పురాణ ప్రసిద్ధమైన శతశృంగపర్వతము అను వదంతి కలదు. దీనిలో ఒక అంతరగంగ ప్రవహించుచున్నది. గౌరీబిదనూరువద్ద పినాకినీనదీ తీరమున “విదురాశ్వత్థం" అను పుణ్యక్షేత్ర మున్నది. ఇచ్చట పూర్వకాలమున విదురుడు నాటిన అశ్వత్థ వృక్షమే ఇంకను సజీవముగా నున్నదని చెప్పుదురు. అసంఖ్యాకు లగు భక్తులను ఈ క్షేత్రము ఆకర్షించుచున్నది. ఇక్కడ కూడ ఆధునిక సౌకర్యములు మైసూరు ప్రభుత్వం వారు కల్పించిరి. కోలారునకు సమీపములోనున్న ఉరిగాం, రాబర్ట్సన్

115