ఈ పుట ఆమోదించబడ్డది
- 79
సంస్కృతన్యాయములు
మల్లగ్రామన్యాయము :
ఇతరజాతులుకూడ ఉండినను, మల్లురు అధికముగాఁగల యూరికి మల్లగ్రామమనియే వ్యవహారము కలుగును.
బ్రాహ్మణగ్రామన్యాయము, ఆమ్రవనన్యాయమువలె.
మహాదర్పణముఖన్యాయము :
పెద్దఅద్దములో పెద్దముఖము. (చిన్నఅద్దములో చిన్న ముఖము.)
మహానసశశన్యాయము :
వంటయింటఁ జొచ్చిన కుందేలు సులభముగఁ బట్టుపడును.
(భార. ఆది. 6-186)
మహామత్స్యతీరన్యాయము :
పెద్దచేప నదిలో ఈదరినుండి ఆదరివఱకు నెగిరిపడుచుఁ దిరుగుచుండును. కాని అది ఆఒడ్డులకంటె వేఱయి యుండి ఒడ్డులను తాకదు.
ఉదా:- జాగ్రదాద్యవస్థల నంటియుండియు నుపాధుల నంటక భిన్నముగ నుండు పరతత్త్వము.
మహార్ణవయుగచ్ఛిద్రకూర్మగ్రీవాప్రవేశన్యాయము :
రెండుతరంగములమధ్య నెటు పోలేక అలలతాఁకుడున కలసి తుద కెటులో తాఁబేలొం డొకతరంగమున గ్రీవాప్రవేశ మొనరింప నేర్చినట్లు.