ఈ పుట ఆమోదించబడ్డది
72

సంస్కృతన్యాయములు

భ్రష్టావసరన్యాయము

వేళకు లేనందువలన దత్ఫలము భ్రష్టమైనట్లు.

"సమయానికి లేని భాకా చంక నాకనా?" అని సామెత.

నిష్ప్రయోజనమైనది అని త్యజింపబడినవస్తువువే మఱొపు డవసర మవుచుండును.


ఖ్యాదిన్యాయము

ధాతుపాఠమున స్వాభావికముగ భ్వాదిధాతువులకో యర్ధము నొడువబడియుండును. కాని, ప్రాధ్యుపసర్గలతో సంయోగము గలయవు జాధాతువు లనేకార్ధబోధకము లవును.

అద్వితీయ బ్రహ్మముపాధిభేదముల ననేకత్వమున స్ఫురించును.


మంజూషాఖున్యాయము

ఆహార మున్నదను నాసచే సాములపెట్టెగు కన్నమువైచి ఎలుక లోనికి బోవ లోనిపాము దానిని బట్టి తిని, ఆకన్నముద్వారా నెలుపలికి వచ్చి ఎందో పోవును.

లాభము సలుగునని పోగా లాభప్రాప్తి అటుండ, నని నష్ణము పైబడినట్లు.

మూషికాహిమంజూషాన్యాయమును జూడుము.