ఈ పుట ఆమోదించబడ్డది
71

సంస్కృతన్యాయములు

తేనెటీఁగ కుట్టినచో మనదేహము దద్దురువాఱి చాల బాధ ననుభవించును. అది మొనదేఱిన తన మొగమునందలి ముంటితో నెట్టికఱ్ఱనైనను నంధ్రము పడఁజేయును. కాని, మకరందమును ద్రావునేకాని అతి మృదులమవు కమలమున కాముంటితో నెట్టిహానియుఁ జేయదు.

(బద్ధిమంతుఁడు సమర్థుఁడయ్యు నేరికిని కష్టము కలిగింపఁడు.)


భ్రమరకీటన్యాయము

తుమ్మెద పురుగును దెచ్చి తన గూటనుంచి దానిచుట్టు తిరిగి ధ్వనిచేయును నుండఁగా నుండఁగా నాపురుగు ఆ నాదమువినుచుఁ గొంతకాలమునకు తుమ్మెదగా మాఱును.

(మను. 2-36)

"కీటకముఁ దెచ్చి భ్రమరము, పాటవమున బంభ్రమింప భ్రాంతంబై త, త్కీటకము భ్రమరరూపముఁ, బాటించి వహించుఁగాదె భయయోగమునన్‌."

(భాగ. 7 స్కంధము.)

"ప్రాలేయాచలకన్యకావదన.... ...భ్రమరకీటన్యాయరీతిం బురిన్‌" కాశీఖండము.