ఈ పుట ఆమోదించబడ్డది
67

సంస్కృతన్యాయములు

భూలింగన్యాయము

భూలింగమను నొక పక్షి గలదు. అది 'అతిసాహసము పనికిరాదు ' అని అఱుచుచుండును. కాని తానుమాత్రము సింహాముదౌడలలోని మాంసమును పెఱికి తినును. ఇతరులకు ఉపదేశముయ్ చేయుచు తాను మాత్ర మట్లాచరింప కుండుట. దీనినే "భూలింగశకునిన్యాయము" మనియు నందురు.

భూశైత్యౌష్ణన్యాయము

భూమికి జల్లదనము, వెచ్చదనము ఆరోపించినట్లు, భూమికి స్వాభావికగుణము గంధవత్త్వమ్,ఉ. (గ్రంధవతీ పృధివీ) అయినను హిమాదులవలన జల్లవడిన జల్లదన మును, ఎండవేడిమి మొదలగువాని మూలమున గాలిన ఉష్ణత్వము ను కలుగుచుండును.

భేకరన్యాయము

కప్పలు అఱచినట్లు.

భేర్యాఘాతన్యాయము

నలుగురిదగ్గఱ భేరీ లున్నవారు నలుగురు తమ తమ భేరీల నొకేపర్యాయము వాయించవలయునను నియమము లేదు. వారియిష్టము. మనసైనప్పుడెల్ల వాయించుకొనుచు పొవుచుందురు. (అనియమితముగ జరుగు విషయములందీన్యాయ ముపయో గింపబడును)