ఈ పుట ఆమోదించబడ్డది

59

సంస్కృతన్యాయములు

బకబంధనన్యాయము
  • పంజరములోనుంచి పెంచిన కొంగ చిలుకవలె పలుకునా?
  • పంజరబకన్యాయమును చూడుము.
బకవృత్తిన్యాయము
  • నీటిఒడ్డున కొంగజపమువలె.
  • తీరబకన్యాయమును జూడుము.
బధిరకర్ణజపన్యాయము
  • చెవిటివానిచెవిలో గుసగుసలు.
బధిరజాపన్యాయము
  • చెవిటివానిచెవిలో రహస్యము చెప్పినట్లు.
                                      (పంచతంత్ర. 336)
బధిరవీణాన్యాయము
  • చెవిటివానికి వీణ వినిపించినట్లు.
బధిరశంఖన్యాయము
  • "చెవిటివానిచెవిలో శంఖూదినట్లు.
  • "(కళా. 2-90. )
  • "అంధేందూదయముల్‌ మహాబధిరశంఖారావముల్‌"
                                            (భాగవతము.)
బహుచ్ఛిద్రఘటోదరదీపన్యాయము
  • చాలచిల్లులు గల కుండలోఁ బెట్టఁబడిన దీపము అన్ని