ఈ పుట ఆమోదించబడ్డది
58
సంస్కృతన్యాయములు
- ప్రవత్స్యద్భర్తృకాన్యాయము
- భర్తదూరదేశమునకుఁ బ్రయాణమగుచుఁడ నాతని యెదుటనె భార్య యేడ్చినట్లు.
- ప్రసక్తానుప్రసక్తన్యాయము
- ఒకపని సాధింపఁ బూనుకొనిన మఱియొకఫలముగూడ గలిగినట్లు.
- ప్రసూతివైరాగ్యన్యాయము
- ప్రసవసమయమున నెప్పులకోర్వలేక ఇఁక మగనిపొత్తు ప్రమాదముననైనఁ గోర నని వైరాగ్యమునొందిన వనిత అది తీరినవెనుక మఱల మామూలు వ్యవహారమునకు గడఁగినట్లు.
- శ్మశాన, పురాణవైరాగ్యముల విధమున.
- ప్రాసాదవాసిన్యాయము
- మేడలో ఉన్నవారనిన, వారు రేయింబవళ్లు మేడమీఁదనే ఉండరు; క్రిందకూడ ఉందురు.
- ప్లవంగగతిన్యాయము
- కోతిగంతు లట్లు.
- ఫలవత్సహకారన్యాయము
- పండ్లకొఱకుఁ బెరటిలో నాటఁబడిన తీయమామిడి చెట్టు పండ్లేగాక నీడను, మంచిసువాసనను అడుగకయే ఇచ్చును.