ఈ పుట ఆమోదించబడ్డది

57

సంస్కృతన్యాయములు

ప్రత్యాపత్తిన్యాయము
  • దగ్గఱ ఉంటేనే (కావలసినపని త్వరగా నెఱవేఱుట)
ప్రదీపన్యాయము
  • పరస్పరవిరుద్ధము లయ్యు నూనె, ఒత్తి, అగ్ని మూఁడును గలిసి లోకోపకారము చేయును.
ప్రధానమల్లనిబర్హణన్యాయము
  • సేనాధిపతినిఁ గొట్టినచో సేనయంతయు లొంగునట్లు.
  • పేరుగల జెట్టిని గెలిచినచో తక్కినవారందఱు పరాజితులే యగుదురు.
ప్రపామేలనన్యాయము
  • ఎక్కడెక్కడివారో చలివేంద్రములో జలపానార్థమై వచ్చి కలిసి తిరిగి ఎవరిత్రోవన వారు పోవుచుందురు. *నదీప్రవాహమునఁ గొట్టుకొనివచ్చు పుల్లలు; సత్రాగతజనులు వలె.
  • ఉదా:- ఋణసంబంధముచే నొకచో గలియు తండ్రి, తల్లి, కుమారుఁడు మున్నగువారు.
ప్రమదాన్యాయము
  • ఇరువురు భార్యలు కలవానికి ఒక భార్యవలన సుఖము, ఆమెమూలమున రెండవభార్యవలన దుఃఖము కలుగును. ఆమె ఒక్కతెయే ఆసుఖదుఃఖములకు మూలకారణము.