ఈ పుట ఆమోదించబడ్డది

55

సంస్కృతన్యాయములు

లోమములు అనఁగా అధఃకేశములు. కేశములు, లోమములు పురుషదేహమునుండి పుట్టినవే.

  • (శరీరములో నుండియే వచ్చినను పాలు పాలే; మూత్రము మూత్రమే.)
పుష్కరపలాశన్యాయము
  • తామరాకుఁ నీటిచేఁ దడియదు.
  • పద్మినీపత్రజలన్యాయమును జూడుము.
పుష్పలగుడన్యాయము
  • అఱచుచు గఱువవచ్చు కుక్కలలో మొదటిదానిని కఱ్ఱతో గొట్టి తక్కినకుక్కలను అదేకఱ్ఱసాయమున వెంటబడి తఱిమివైచినట్లు.
పుష్పవంతోపకారన్యాయము
  • పుష్పవంతు లనఁగా సూర్యచంద్రులు. వారు తక్కిన గ్రహములకు తమరాసులలో నిలువ నవకాశము నిచ్చియు, ప్రకాశము నిచ్చియు నుపకారము చేయుచుందురు. సూర్యచంద్రులు క్షణమైనను నిలువక దివారాత్రములు సంచారము చేయుచు వెలుతు రొసఁగియు సస్యాదులు ఫలింపఁ హేతువులై జగదుపకారకరు లవుచుందురు.
పూతికూశ్మాండన్యాయము
  • నీటిలోఁ బుట్టిన గుమ్మడికాయవలె.
  • చిత్రామృతమువలె అనుభవింప యోగ్యము గానిది.