ఈ పుట ఆమోదించబడ్డది

54

సంస్కృతన్యాయములు

పిష్టప్రమిత్యపూపన్యాయము
  • పిండికొలఁదిరొట్టె, విత్తముకొలఁది విభవము అనునట్లు.
పీలుపత్రపలన్యాయము
  • గొలుగుచెట్టుఆకులు చేదుగా వగరుగా నుండును. పండ్లు తీయగా నుండును.
పుంవిషయన్యాయము
  • పురుషుఁడు విషయములకంటె భిన్నుఁడైనట్లు.
  • నానావృక్షరసమువలె.
పురాణవైరాగ్యన్యాయము
  • పురాణము వినినంతసేపు వైరాగ్యము చిలవలు పలవలు వేయుచుండును. లేచి ముడ్డి దులిపినతోడనే ఆవైరాగ్యము పోయి తిరిగి ఎప్పటి కొంపా గోడే.
  • (గాటిలో పడుకున్న కుక్కమాదిరి.)
  • శ్మశాన; ప్రసూతివైరాగ్య న్యాయములట్లు.
పురుషకేశలోమన్యాయము
  • దేహమునుండియే వెండ్రుకలు పుట్టును.
  • (దేహ కేశన్యాయమును చూడుము.)
  • కేశములు అనఁగా ఊర్ధ్వకాయమునఁబుట్టిన శిరోజాదులు.