ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ రామకథామృత గ్రంథకర్తలు, శతావధానులు నగు బ్రహ్మశ్రీ తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రిగారి కుమారులు, శతావధానులు, రామకథామృతోత్తరకాండ రచయితలు నవు బ్రహ్మశ్రీ రాఘవనారాయణశాస్త్రిగారు.

చందవోలు, 20 - 11 - 39

"సంస్కృతన్యాయములు" అనుపేర భవన్&ముద్ర్యమాణ గ్రంథమును యథావకాశముగ బరికించితి. ఇది "పరిభాషేందు శేఖరము" వలె నచ్చటచ్చటి న్యాయములన్నియు నొక్కచో సమకూర్చి వివరింపబడుట బహు శ్రమసాధ్యమైన పని. వివరించెడు పట్ల దెలుగుబాసయు సర్వజనసుబోధమై హృదయంగమమై యున్నది. పండితులకు సైత మొకప్పుడు మిక్కిలి సహాయ మొనర్చు నిప్పొత్తము విద్యార్థి జనుల కత్యావశ్యక మని వేఱె చెప్పనక్కఱలేదు. అందును లౌకిక న్యాయముల నెట్లో తెలిసికొననగు గాని యేతద్ద్వితీయ భాగమునందలి శాస్త్రీయ న్యాయసమర్థనము నండాగొనక యిప్పటి విద్యార్థులు భాషాసముద్రము నీదజాలరు. విద్యార్థులే యననేల, యిప్పటి విద్యాపూర్ణులును మునుపటివలె పుస్తకాపేక్షలేని వారు నాకు ననుభవమున నెవ్వరు గన్పట్టుటలేదు. అట్టిచో నిట్టి పొత్తమునకు విద్వద్విద్యార్థి జనసమీహితముల స్థాన