ఈ పుట ఆమోదించబడ్డది
44
సంస్కృతన్యాయములు
- నసిప్రోతబలీవర్దన్యాయము
- ఎద్దుకు ముకుద్రాళ్ళు కట్టినట్లు.
- నాంతరీయకన్యాయము
- వలసినయంతవఱకే అర్థము గ్రహింపవలెను.
- (వడ్లు దంపి తినుటకు బియ్యమే గ్రహించినట్లు.)
- నానావృక్షరసన్యాయము
- అనేకవృక్షములలో నుండు రస మావృక్షములకంటె భిన్నమైయుండును.
- నారికేళతృణన్యాయము
- కొబ్బరిచెట్టు నెందుల కెక్కెదవనిన దూడ గడ్డికొఱకు అనినట్లు.
- నారికేళాంబున్యాయము
- కొబ్బరికాయలోనికి నీ రెట్లు వచ్చినదో ఎవరికీనీ దెలియదు.
"సిరితా వచ్చిన వచ్చును, సరభసముగ నారికేళ సలిలముభంగిన్" (సుమతిశతకము.)
- నాసికాంగుళీన్యాయము
- ఎవరిముక్కురంధ్రములో వారివ్రేళ్లేవైనఁ బట్టును.
- నాసిప్రోతోష్ట్రన్యాయము
- ముకుద్రాఁడువైచిన ఒంటె మాదిరి.
- నసిప్రోతబలీవర్దన్యాయము మాదిరి.