ఈ పుట ఆమోదించబడ్డది

41

సంస్కృతన్యాయములు

దృష్టిసృష్టిన్యాయము
  • బ్రహ్మ జాగ్రదవస్థలో ప్రపంచమును సృష్టించును; సుషుప్త్యవస్థలో తనచే సృజంపబడిన ప్రపంచమును తన యందు లీనము చేసికొనును.
దేవతాధికరణన్యాయము
  • ఏదేనిప్రతిమయం దిష్టదైవము నావాహనముచేసి పూజించి అభీష్టములను పొందుట.
దేవదత్తపుత్రన్యాయము
  • దేవదత్తునిపుత్త్రుడు దేవదత్తుని భార్యకును బుత్త్రుడే.
దేవదత్తహంతృహతన్యాయము
  • దేవదత్తుని జంపినవానిం జంపిన దేవదత్తుడు బ్రతుకునా?
దేవదత్తహననోద్యతహతన్యాయము
  • దేవదత్తుని జంప బ్రయత్నించినవాడు చనిపోయిన దేవదత్తుడు బ్రతికియేయుండునుగదా!
దేహకేశన్యాయము
  • దేహమునుండియే వెండ్రుకలు పుట్టును.
దేహళీదీపన్యాయము
  • గడపమీద దీపము పెట్టిన నింటిలోను బైటనూ గూడ నుపయోగించును.
  • "ఏకా క్రియా ద్వ్యర్థకరీ"