ఈ పుట ఆమోదించబడ్డది
40
సంస్కృతన్యాయములు
- దీపకలికాన్యాయము
- చిన్నదీపము చీకటి అంతయు మ్రింగివైచినట్లు.
- దుర్జనగర్దభన్యాయము
- దుర్జనునకు గాడిదకు భేదము లేదు.
- గాడిద ఎంతకొట్టినను తనస్వభావమును విడువదు; మంచి చోటును దొర్లి పాడుచేయును. దుర్జనుడును అంతే. సజ్జనుల యశమును పాడుచేయును.
- దుర్జనమశకన్యాయము
- దుర్జనుడు దోమను బోలినవాడు.
- "కానరాకడాగ; రానీక చెంతకు
- దోలి తోలి కొట్ట; గూలనడచ
- సందు లెమకి యెటులొ సాధించు బాధించు
- దోమ యౌర! తులువ రామకృష్ణ!" - వ్యాఖ్యాతల రామకృష్ణశతకమునుండి.
- దూరగిరిన్యాయము
- దూరపుకొండలు నునుపు. దగ్గఱకు బోయిన జెట్టులు గుట్టలును.
- దూర్వామూలన్యాయము
- గరిక వేరు భూమిలో నుండి యుండి చినుకు పడగానే చిగుర్చును. కాని యెన్నటికిని జావదు.