ఈ పుట ఆమోదించబడ్డది

34

సంస్కృతన్యాయములు

తీర్థకాకన్యాయము
  • కాకి తీర్థములలో మునిగినను ఫలము గాంచనేఱదు.
తుంబీవికలవీణాన్యాయము
  • తుంబకాయబుఱ్ఱ లేనిదే వీణ పాడదు.
తులాదండన్యాయము
  • త్రాసుయొక్క దండము బరువుగా నున్ననైపు క్రిందికిని, తేలికగానున్ననైపు మీదికిని బోవును.
తులోన్నమనన్యాయము
  • ఒకవైపున వ్రేలితో ఎత్తిన త్రాసు అప్రయత్నముగ ఒక వైపు పైకిని, మఱొకవైపు క్రిందికిని పోవును.
తుల్యబలప్రేషణన్యాయము
  • సమానమైనబలముగలవా రొకరి నొకరు తమపనులయందు నియోగించుకొందురు.
తుల్యాయవ్వయన్యాయము
  • ఆయమునకు దగిన వ్యయము.
తుషాఘాతన్యాయము
  • ఊకదంపుడు.
  • దీనినే 'తుషఖండనన్యాయము' అనియు నందురు.
తుష్యతు దుర్జనన్యాయము
  • తనకార్యములచే దుష్టుడు ప్రస్తుతము సంతోషము నొందుగాక; అదనున దత్ఫల మనుభవింపకపోడు.