ఈ పుట ఆమోదించబడ్డది

32

సంస్కృతన్యాయములు

తప్తమాక్షికోద్ధరణన్యాయము
  • కాగేనూనెలో పడి చచ్చిన ఈగను నేర్పుగా వ్రేలితో తీసివేయవచ్చును.
  • (అభ్యాసమువలన కలుగు ఫలితములు.)
తప్తాయఃపిండన్యాయము
  • కాలిన ఇనుపగుండునకు పొగ యుండదుగాని, తక్కిన యగ్ని లక్షణము లన్నియు నుండును.
తప్తాయసపత్రబిందున్యాయము
  • కాలిన ఇనుప రేకుపై జలబిందువు పడినయెడల నామరూపములు లేక నశించును.
తమోదీపన్యాయము
  • దీప మున్న చో జీకటి యుండదు.
తమఃప్రకాశన్యాయము
  • చీకటిని వెలుతురు అణచిచేయును.
తరక్షుడాకీనీన్యాయము
  • పెద్దపులి నెక్కి మహాకాళి వచ్చినట్టు.
తరంగన్యాయము
  • అలలు ఒకదానివెనుక నొకటి విడువక వచ్చుచుండును.
తరంగప్రతిబింబన్యాయము
  • తరంగములయందు ప్రతిబింబించు సూర్యు డొక్కడే యైనను వానియందు పెక్కులై కానిపించును.