ఈ పుట ఆమోదించబడ్డది

28

సంస్కృతన్యాయములు

జలతాడనన్యాయము

నీటిని కఱ్ఱతో గొట్టినను దెబ్బతగులదు; లొట్టపడదు. ఊషరవృష్టివలె నిష్ప్రయోజనము అనిభావము.

జలతుంబికాన్యాయము

సొరకాయబుఱ్ఱను మట్టితో నింపి జలమున వైచిన అజి మునిఁగిపోవును. ఆమట్టి నీటఁ గఱగిపోయిన సొరకాయ బుఱ్ఱ పైకి తేలును. (దేహసంబంధ మున్నంతవఱకు జీవాత్మ భూలోకమున నుండును; దేహసంబంధము నశించినయపు డాకాశము నకుఁ బోవును.)

జలతైలబిందున్యాయము

నీటిపై వేసిన నూనెచుక్క నీరంతటను వ్యాపించును. కానీ దానికి నీరు అంటదు.

జలబిందునిపాతన్యాయము

ఒక్కొకనీటిబొట్టు పడి క్రమముగ కుండఅంతయునిండును.

జలమథనన్యాయము

నీటిని తఱచినట్లు. పాలు మథించిన వెన్నవచ్చును. నీటిని మథించిన వచ్చు నది నడుమునొప్పియే. గొడ్డురాలివద్ద పాలు గుడిచినట్లు వ్యర్థమని భావము.