ఈ పుట ఆమోదించబడ్డది

26

సంస్కృతన్యాయములు

చిత్రామృతన్యాయము
  • బొమ్మలోని అమృతమువలె.
  • అనుభవింప యాగ్యముకానిది అని భావము.
చోరాపహార్యన్యాయము
  • దొంగయు, దొంగిలింపబడినవాడును పరస్పరముభిన్నులు.
  • ఉదా:- జీవేశ్వరులు.
చిత్రితాంగజంబుకన్యాయము
  • పులిని జూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు.
ఛత్రిన్యాయము
  • ఒకమనుష్యుని యానవాలు చెప్పుటకు దుస్తులు మున్నగునవి యనేకములుండగా గొడుగు పట్టుకొనివెళ్ళువాడు అని చెప్పినట్లు.
ఛాగపశున్యాయము
  • సామాన్యముగ పశుశబ్దమునకు వృషభాదులు అని యర్ధమున్నను వేదమం దొకానొకచో మేక యని యర్ధము కాన వచ్చుటచే యజ్ఞములయందు పశుశబ్దమునకు మేక యనునర్థమే వర్తించుచున్నది.
ఛురికాకూశ్మాండన్యాయము
  • కడవెడు గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ.