ఈ పుట ఆమోదించబడ్డది

25

సంస్కృతన్యాయములు

చర్వితచర్వణన్యాయము

నమలినదే మఱల నమలినట్లు.

చాతకీజీమూతన్యాయము

ఎల్లెడ జలము లభించినను చాతకపక్షికి దప్పి మేఘము నుండిపడిన నీటిబిందువులచేఁగాని తీరదు. ఇతరసుఖము లెన్ని యున్నను తనకోర్కె నెఱవేర్చుదానితో సాటికావు.

చాలనీన్యాయము

జల్లెడలోఁ బోసి జల్లించినట్లు.

చిత్రపటన్యాయము

ముందు రేఖలు గీచి పిదప బొమ్మను వ్రాసినట్లు.

చిత్రాంగనాన్యాయము

చిత్రపటములోని అందకత్తెను జూచి సంతసించినను కౌఁగిలించుకొనరు. (జ్ఞాని నిషిద్ధక్రియాచరణమునకుఁ గడంగినను తత్ఫలభోగి మాత్రము కాఁడు.)

చిత్రానలన్యాయము

బొమ్మలేని నిప్పువలె. పేరునకుమాత్ర మగ్నియే యైనను దాహకత్వాదిగుణ శూన్యమవుటచే నయ్యది నిరర్థకము.