ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్ష్మి గ్రంథమండలి, తెనాలి

నియమములు

మాగ్రంధమండలిలో సమర్ధులగు పండితులచే ర చింపబడిన పౌరాణిక, ఆర్ధిక, రాజకీయ సంబంధములగు గ్రంధములు--రెండువందల పుటలకు పైగనుండునవి - సంవత్సతమునకు నాలుగు వంతున ప్రకటింపబడును.

అవకాశమునుబట్టి అనుబంధములుగా గొన్ని చిన్న చిన్న పుస్తకములుగూడ - అందఱకు నుపయోగపడునవి--ప్రకటించుచుందుము. ఈ చిన్నపుస్తకములు, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ప్రబోధించునవిగా నుండగలవు. ఈయవి రచించుటలోవిదుషీమణుల కెక్కువప్రాధాన్య మీయబడును.

ఈగ్రంధమండలిలో జేరువారు "మహారాజపోషకులు, పోషకులు, అభిమానులు, చందాదారులు" అని నాలుగు తెగలుగ వ్యవహరింపబడుదురు.

మహారాజపోషములు

ఒకేసారి రు.50-0-0 (ఏబదిరూయ)లొసంగువారు మహారాజపోషకులగుదురు. గ్రంధమండలి యున్నంతకాలము, గ్రంధమండలిలో నచ్చగు ప్రతిపుస్తకము నందును వీరిపేరులువేయుచు పుస్తకము లుచితిముగాబంపెదము. ప్రతిఉస్తకమువీరికి క్యాలికోబైండుచేసి ఈయబడును.

పోషకులు:

పోషకులుగా జేరువా రొకేసారి రూ 25-0-0 (ఇరువదియైదు రూప్యము)లీయవలయును. వీరికిని మహారాజ