ఈ పుట అచ్చుదిద్దబడ్డది
358

సంస్కృతన్యాయములు

శీర్షే సర్పో దేశాన్తరే వైద్య:

తలమీద పాము; దేశాంతరమందు వైద్యుడు.

నెత్తిమీద వర్షకాలపు మేఘాడంబరము; దూరదేశమున భార్య. ఇక నాస్థితి నెత్తిమీద పాము; హిమవత్పర్వత ముపై పామువిషముమును నివారించు మూలికలు అనునటులున్నది. అని యొక విరహవ్యధాతప్తుడు తన వ్యధ వెలి బుచ్చెను.

శ్వ:కార్య మధ్య కుర్వీత

రేపటిపని నివ్వాళనే పూర్తి చేసుకొనుట క్షేమకరము. నేటిపని సయితము సోమరితనముచే రేపటిపై బెట్టక రేపటిదిసయిత మీనాడే చక్కబెట్టుకొనువాడు సేమము నొందును.

అనగా--అవ్యగ్రతతో గార్యములందు బ్రవర్తించుట క్షేమకరమని న్యాయశయము.

ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు "శ్వ:కార్యమద్య కుర్వీత-రేపటిపనిని నేడే చేయుడు" అని బోధించగా, నొక పిల్లవాడు లేచి- అయ్యా! రేపు నేను చచ్చిపోవుదును అనెను. వెంటనే పంతులు--అట్లయిన నేడే ఆపనిని చేయుము. అది చాల మంచిది--అనెనట.

శ్వలీఢ మీవ పాయసం

శ్వలీఢపాయసన్యాయమును జూడుము.