ఈ పుట ఆమోదించబడ్డది

20

సంస్కృతన్యాయములు

గర్ధభరోమగణనన్యాయము

గాడిదబొచ్చు లెక్క పెట్టుటవలన ప్రయోజనమేమి?

గలేపాదుకాన్యాయము

ఎవడైన మెడలో చెప్పు కట్టుకొనునా? అసంబద్ధవర్ణనమని తాత్పర్యము.

గుంజాగ్నిన్యాయము

గురువిందను జూచి నిప్పు అనుకొనినట్లు.

గుడజిహ్వికాన్యాయము

బెల్లము నాలుకపై నున్నంతసేపే తీపి.

గుడోపలన్యాయము

బెల్లముగొట్టిన ఱాయివలె.

గురుశిష్యన్యాయము

యథార్థపుగురుశిష్యులు ఒకరినొకరు బాసియుండజాలరు. విధివశమున దూరంగతులైనను వారిమనస్సులుమాత్రమత్యంతసన్నికృష్టములై యుండును.

గృహదీపికాన్యాయము

ఇంటిలో నొకచోట నున్నను దీప మిల్లంతయు ప్రకాశింపఁ జేయును.

గృహబద్ధకుమారీన్యాయము

ఇంటిలోఁ గట్టిపెట్టఁబడిన కలబంద పెరుగనూ పెరుగదు, చావనూ చావదు.