ఈ పుట అచ్చుదిద్దబడ్డది
347

సంస్కృతన్యాయములు

పోయవలయునని వ్యవస్థ జేయుచు రెండవ వాక్యము ప్రారంభింప బడుచున్నది. ఈరెండు వాక్యములలో ఆనంతరికవిధికే బలము కావున కౌండిన్యునకు మజ్జిగయే పోయబడుచున్నవి.

రాజార్ధౌపయికం నిత్య ముష్ట్రో వహతి కుంకుమం రాజుగారి కుపయోగింపబడు కుంకుమను ప్రతిరోజు (మోసుకొనిపోవుసమయమున) ఒంటె (ముందు) తాను వహించును.

రాత్రౌ దీపశిఖాకాంతి ర్న బానా వుదితేపతి

దీపపువెలుతురు రాత్రియే యుండునుగాని సూర్యోఫ్దయమైన నుండల్దు. దీపపు వెలుతురు రాత్రియే కావలయునుగాని సూర్యోదయమైన పిమ్మట ననవసరము.

రాధావెధోపమా

రాధా అనగా-- చిత్రింపబడిన చాలచిన్న స్త్రీ చిత్రము. వేధ అనగా-- అందలి చిత్రకారత్వము.

చాలచిన్న బొమ్మయందలి పనితనమును గమనించుట చాల కష్టసాధ్యము. అట్లే--

చాల సూక్ష్మై దుర్లభమైన అంశమం దీన్యాయము ప్రవర్తించును.

ఉదా--"రాధావేధోపమం ధర్మసూక్షమ్" "దుష్ప్రాపం రాధావేధోపమం మానుష్యం"