ఈ పుట అచ్చుదిద్దబడ్డది
338

సంస్కృతన్యాయములు

భతుంచరాబు క్లేశము ఒకదానిపై నొకటి అవిచ్చిన్నముగ పైబడుసమయముల నీన్యాయమవతరించును.

య త్కృతకం త దవిత్యం

స్వభావసిద్ధముగాక కృత్రిమముగ కల్పిత మైనదంతయు ననిత్యమే.

బ్రహ్మచే సృష్ట మైనదిగావుననే ప్రపంచమున కవిత్వత్వము ప్రాప్తించినది. సృష్ట్యాదులు లేక నిర్వికారమై స్వతసిద్ధముగ త్రికాలాబాధ్యమవు బ్రహ్మవస్తు వకృతకము కావున నిత్యమని పేర్కొనబడుచున్నది.

యత్రావృతి స్తచ్రగుడా:

ఆకార మున్నతావుననే గుణములు నుండును. స్వరూపము సుందరమై నేత్రానందకరముగా నున్న నద్దానిగుణములును ఆనందజనకములుగ నుండును.

యత్ర ధూమ న్తత్గ్ర వహ్ని:

పొగ ఉన్నచోట అగ్నికూడ ఉండును.

ఉదా-- వహ్నిమాన్ పర్వత:, ధూమవత్త్వావాత్

ఎక్కడ పొగ ఉండునో అక్కడే అగ్నిఉండును గాని మఱొకచో నుండదు.

చూడుము--స్న్యవేశ్మిస్థితా ద్ధూమాన్న వేశ్మాన్తర మగ్నివత్.