ఈ పుట ఆమోదించబడ్డది

18

సంస్కృతన్యాయములు

ఖండితశాఖాన్యాయము

కొమ్మ తెగగొట్టినను మరల చిగిర్చుచుండును.

ఖడ్గకోశన్యాయము

ఒఱచూచి కత్తి కలదని భయపడి పాఱిపోయినట్లు.

ఖరాశ్వన్యాయము

చూడగా చూడగా గుఱ్ఱము గాడిదయైనట్లు.

ఖర్వాపేక్షితఫలన్యాయము

పొట్టివాఁడు అందని ఫలములకు చేయి జాపినట్లు.

ఖలేకపోతన్యాయము

కళ్ళములోఁ బావురములు వ్రాలి గింజలు తినుచుండ, వానిని బట్టుకొనుటకై యెఱుకవాడు వలవేయఁగా అవన్నియు నొక్కసారిగా లేచి వల యెత్తుకొని పోయినవి.

ఖల్వాటబిల్వీయన్యాయము

బట్టతలవాడు ఎండవేడిమికి తాళఁజాలక నీడకై మారేడు చెట్టుక్రిందికి రాఁగా కాయ తలపైఁబడి గాయము పడెను.

గగనకుసుమన్యాయము

ఆకాశమున పుష్పములు పూచినట్లు.

గగనరోమంధన్యాయము

ఆకాశమున ఆవులు నెమరవేసిన నురుగున్నట్లు. అసంభవమని తాత్పర్యము.