ఈ పుట అచ్చుదిద్దబడ్డది
331

సంస్కృతన్యాయములు

మణ్ణూకదసాక్తాక్షాణాం వంళే షూరగభ్రమ:

కప్పక్రొవ్వుతో తయారుచేయబడిన కాటుక పెట్టుకొనిన కన్నులుగలవారికి వెదుళ్లు పాములా అను భ్రమకలుగును. వెదురుకఱ్ఱకు పాముతో నించుక సాదృశ్యము కలదు. కాని, దానియందు సాక్షాద్వవంశత్వము పిహితమై ఉరగత్యమకారణముగ నారోపింపబడదు. మండూకవసాంజనము వలన మూత్రము ఆ వంశత్వము పిహిత్ మగుచున్నది. అంతమాత్రముగ వంశత్వము నశింపదు. వసాంజనప్రభావమున నట్లు కంటికగపడును. కావున మండూక వసాంజనము కేవ్లము వంశత్వపిధానమున నిమిత్తమాత్రమయి ఉరగత్వభ్రమను కల్పించుచున్నది.

అనుకూలవస్తువులయం దననుకూల వ్యవహారమును జనింపజేయు సాధనములయందును, ప్రాధనసాధ్య విరూపవస్తుత్వ భ్రమయందు ఈన్యాయము ప్రవర్తించును.

మదశక్తివత్

మదశక్తివలె

పృధివ్యాదిపంచభూతసఘాతమునుండి దేహమును, దేహమునందలి సర్వాంగముల సారభూతమై మదశక్తియు కలుగును.

అట్లే-- శరీరాకారపరిణతభూతసంఘమున చైతన్యమును, చైతన్యవిశిష్టమై నిజ్ఞానము (ఆత్మ) నుండునని కొందఱమతము.