ఈ పుట ఆమోదించబడ్డది
16
సంస్కృతన్యాయములు
- కులాలకీటన్యాయము
- కుమ్మరపురువు మట్టిలో పొరలాడు చున్నను దానికి మట్టి యంటుకొనదు.
- కుక్షిస్థమక్షికాన్యాయము
- ఈగ చిన్నదైనను కడుపులో జొచ్చి తిన్న యన్నమంతయు వెడలగ్రక్కించును.
'ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా' - వేమన.
- కూపకూర్మన్యాయము
- నూతిలో నున్న తాబేలు ఆనూయియే సమస్తప్రపంచమని భావించును.
- కూపఖననన్యాయము
- కొంప లంటుకొన్న తరువాత నూయి త్రవ్వ నారంభించినట్లు.
- కూపమండూకన్యాయము
- నూతిలోనున్న కప్ప అనూయియే సమస్తప్రపంచమని భావించును.
- భీమే. 1.13.
- కూపయంత్రఘటికాన్యాయము
- నూతిలోని నీరు చేదునపుడు యంత్రమునందలి ఘటమొకపు డూర్ధ్వగతిము నొకపు డథోగతియు నొందు చుండును.