ఈ పుట అచ్చుదిద్దబడ్డది
305

సంస్కృతన్యాయములు

నప్పటి తావు మఱొకటి. అట్లే--కార్యాంతరములను బట్టి స్థానములును మాఱుచుండును. అన్నివేళల నొకే స్థానముండదు. కాని, దేవదత్తుడుమాత్రము వేఱుకాడు. కావున---

"కార్యప్రయుక్తా హి స్థానవిశేషాదయో న స్వరూపప్రయుక్తా:"

స్థానవిశేషాదులు కార్యములం బట్టి సంబవిచునవే కాని స్వరూపమునుబట్తి సంభవించునవికావు.

న హి వటాంకుర: కుటజబీజా జ్జాయతే

గిరిమల్లెవిత్తనమునుండి మఱ్ఱిమొక్క పుట్టదు.

"అన్యదుప్తం జాత మన్య దిత్యేత న్నోపపద్యతే, ఉప్యతే యద్ధి యద్భీజం తత్తదేవ ప్రతోహతి."

ఏవిత్తనమున కాచెట్టు.

"న హి శ్యామాకబీజం పరికర్మసహస్తేణా పి కలమ్ంకురాయకల్పతే" అనుదానిం జూడుము.

న హి వరఘాతాయ కవ్యోద్వాహ:

కన్య నిచ్చి పెండ్లిచేయుట వరుని చంపుటకొఱకుగాదు. విషపూరితయైన కన్య వరింపబడి వరునికి హాని సంభవించునెడల నీన్యాయము ప్రవర్తించును.