ఈ పుట అచ్చుదిద్దబడ్డది
303

సంస్కృతన్యాయములు

న హి ప్రియం ప్రవర్తు మిచ్చన్తి మృషా హి తైషిణ:

హిరమునుగోరువారు వ్యర్ధముగా ప్రియములైన అబద్ధపు మాటలాడరు.

న హి భవతి రుణ్ణం బదరం

వంటకుండ అగ్నికుండము కాజాలదు.

కుండయందే అన్నము వండబడుచున్నను దానికి దిగువేడి నిచ్చునది పొయ్యి, దాలి, కుంపటి మున్నగు నగ్నికుండము. పదర్ధ మగ్నియందు బడిపోకుండ సాధనమే గాని కుండకావేడినిచ్చు సామర్థ్యము లేదు.

న హి ధవతి తరక్షు: ప్రతిపక్షో హరిణశాబకన్య

పెద్దపులి లేడిపిల్లతో నెదిరి పోరాడా నుద్యమించదు. తుల్యబలులు పరస్పరము ప్రతిపక్షులై పోరాడు;దురుగాని దుర్బ్నలోత్తమబలు లట్లుగాదు.

న హి భిక్షురా: స న్తీతి స్థాల్యో నాధిశ్రీయన్తే? న చ మృగా: సస్తీతి యవా వోప్యన్తే:

బిచ్చగాండ్రున్నారని వంటచేసికొనుట; మృగము లున్నవని పైరు;వేయుట మానుదురా?

"భిక్షుకభియాస్థాల్యవధిశ్రయణ; మృగభియా సస్యానాశ్రయణ; మత్కుణభియా కంధానధిశ్రయణ" న్యాయములను జూడుము.