ఈ పుట అచ్చుదిద్దబడ్డది
296

సంస్కృతన్యాయములు

యుద్ధకర్మయందు నియోగించును. ఈతీరున అందఱి అభిప్రాయము యుద్ధమందు విజయమేయైనను ఒకరొకని పని యొక్కొక్కరగముగ నుండును.

నడ్వరోదకం పాదరోగ:

ప్కరకమైన గడ్డి మొలచిన నీరు పాదరోగము.

పాదరోగకారణ మని భావము

దధిత్రపుసం ప్రత్యక్షో జ్వర:; ఆయుగ్ఘృతమ్; లాంగలం జీవనం మున్నగువానిని జూడుము.

న దాహజ్వరనుత్త్యధన్ మగ్రినాస్యా దృఇస్క్రియా దాహజ్వరమును పోగొట్టుటకు అగ్నితో వైద్యము కావింపబడునా? (చేయబడదు.)

వ యద్గిరికృంగ మారుహ్య గృహ్యతే తదప్రత్యక్షం

గిరిశృంగము నధరోహించి గమనింపబడిన వస్తువు ప్రత్యక్షము గాకపోదు.

అనగా పెద్దమెట్టెక్కిన వానికి అడుగుననున్న యంశములు అప్రయత్నముగనే తెలియవచ్చును అని భావము. వ్యకరణశాస్త్రపండితునకు విన్నంతమాత్రమున శబ్దసాధుత్వానాధుత్వములు తెలియవచ్చునటులు.

న హి కఠోరణ్ధీరవస్య కురజ్గశాబ: ప్రతిభటో బవతి

భయంకరమైన సింహము నెదిరి లేదిఫిల్ల పోరాడగలదా? "నాల్పీయసా మహతో భిభవతి"ని జూడుము.