ఈ పుట ఆమోదించబడ్డది

14

సంస్కృతన్యాయములు

  • (పందికి పందిపిల్లలు పుట్టినను లాభము లేదు; ఏనుగ కొక పిల్ల పుట్టినను చాలును.)
కర్కటీగర్భన్యాయము
  • పీత పిల్లలు పుట్టినతోడనే చచ్చును.
  • భార. విరా. 1 ఆ. 322.
కాకతాళీయన్యాయము
  • కాకి వాలగానే అప్రయత్నముగా తాటిపండు పడినట్లు.
  • విక్ర. 4.61.
కాకత్రోటిబింబన్యాయము
  • కాకిముక్కున దొండపండు గట్టినట్లు.
  • రుక్మి. 1.132.
కాకపికన్యాయము
  • కోవెల కాకులచే బెంచబడినను కాకి కాకియే, కోవెల కోవెలయే. (కాకః కాకః పికః పికః.)
కాకాక్షిగోలకన్యాయము
  • ఒంటికంటిచూపు గల కాకికి రెండు కన్నులు ఉండియేమి ప్రయోజనము ?
కాకరుతన్యాయము
  • పగలు కాకికూత విని జడిసి కాంతుని కౌగిలించుకొన్న కాంత రాత్రి నర్మదానదిని దాటి వెళ్లినదట.