ఈ పుట ఆమోదించబడ్డది
291

సంస్కృతన్యాయములు

పులప్రాణములవలె నూర్ధ్వగమనము నొందక ప్రత్యగ్బ్రహ్యయందు తస్తాయపీతామువులవలె లీనము లవును. జీవన్ముక్తుని దేహత్యాగసమయమున ప్రాణాఖ్యమైన లింగశరీరము తప్తాయ:పీతాంబువులవలె ప్రత్యగభిన్న పరమానందస్వరూపుడవు పరబ్రహ్మమంది లీనమవును.

తరతమబావాపన్నసాధనాయత్తంఫలం తరతమభాపన్నం

తరతమ భావములతో నున్న సాధనములయం దాయత్తమైన ఫలము తరతమభావము నొందియే యుండును.

ఏట్టి సాధనములతో సాధించిన దత్ఫలము సయితము తదనుకూలముగనే యుండును.

తస్కరస్య పురస్తా త్కక్షే సుపణన్ ముపేత్య సర్వాజ్గోద్ఘాటనం

దొంగవానిచంకలో (దొంగిలింపబడిన) బంగారము అదురుగ కనుపడుచుండ గా అచట మాని తక్కిన అవయవము లన్నియు పరీక్షించినట్లు.

తాతస్య కూపో యల్ మితి బ్రువదా: క్షారం జలం కాపురుషా పిబన్తి

మాతాత త్రవ్వించిన బావి యిది అని తెలివితక్కువ వారు ఆబావిలోని ఉప్పునీరే త్రాగుచుందురు.

తీర్ధకాకన్యాయము

"యధా తీర్ధే కాక న చిరం స్థాతారో భన్త్యేవం యోగురుకులాని గత్వాన చిరం తిష్ఠతి స ఉచ్యతే తీర్ధకాక ఇతి."