ఈ పుట అచ్చుదిద్దబడ్డది
280

సంస్కృతన్యాయములు

కారణనాశే కార్యనాశ:

కారణము నశించిన కార్యము కూడ నశించును

అట్లే--కార్యనాశే కారణనాశ:--కర్యము నశించిన కారణముకూడ నశించిపోవును.

కారయితు: కర్తృత్వం

ఛెయించువాడు ఛెయువాడుకూడ అవును.

ఖూనీ ఛెయించువాడు ఛెయువాడు కాడా?

భాధఘాతకన్యాయమును జూడుము.

రార్యేణ కారణసంప్రత్యయ:

కార్యమును బట్టి కారణము వెఱుంగనగును.

కిజ్కరస్థానే రిజ్కరద్వయనివేశనం

ఒకసేవకుడు చాలినచోట ఇరువురుసేవకులను నియమించినట్లు

ప్రయాణమునకు సంసిద్ధిడైల్ యున్న యొక యజమాని సేవకునితో "ఓరీ రైలు కింక నెంత వేళ యున్నది?" అని అడుగగా నాతడు "సరిగా పది నిమిషము లున్న" దని చెప్పెను. అంత యజమాని "రైలుదగ్గఱకు కారెంతసేపటిలో పోగలదు?' అని ప్రశ్నింప-- పదినిమిషములలో పోగలదండీ--అని సేవకుడు బదులాడెను. అంత నాతడు--సరే, త్వరగా పోయి రెండుకార్లు తీసికొని తమ్ము; యింకను త్వరగా పోవచ్చు--ననిచెప్పెనట.