ఈ పుట అచ్చుదిద్దబడ్డది
278

సంస్కృతన్యాయములు

టోటిపశువులదోషమువలన ఆ ఆవుకూడ పరుగిడ నార్ంభించును-- చౌరాపరాధా న్మాండవ్యనిగ్రహ--అను దానివలె.

కొట్తమునిండి వెడలగొట్టబడిన గోవు తిరిగి కొట్టమునకే వచ్చును గాని వేఱొకచోటికి పోదు.

కపోణిగుడన్యాయము

మోచేతిపై బెల్లమున్నదని నాకినట్లు.

వస్తువు లేకున్నను ఉన్నదను నాశచే సోయి మఱొక యవస్థనుపొందునపు డీన్యాయము ప్రవర్తించును.

కర్మభూఅయస్త్య త్పలభూయస్త్యం

కర్మములు మఱలమఱల చేయుచున్న దత్ఫలముగూడ మఱలమఱల సంభవించుచునేయుండును.

ఇయ్యదియే గ్రంధాంతరములందు--అంగభూఅయస్వ్యాత్ఫల భూయస్వ్వమ్--అని యుపయోగింపబడినది.

కలశపురస్పరప్రాసాదనిర్మాణతుల్యం

కలశ్పురస్సరముగ దేవాలయ, ధనికగారములను నిర్మించునట్లు.

ప్రసాదముపై స్వర్ణకుంభ (కలశ), ధ్వజ, ముఖ్యములు స్థాపింపబడుట సుప్రసిద్ధము.

కాకోలూకవిశవత్

కాకులకు రాత్రి గ్రుడ్లగూపబల్కు పగలును, గ్రుడ్లగూబలకి రాత్రి కాకులకు పగలును అవును.