ఈ పుట అచ్చుదిద్దబడ్డది
276

సంస్కృతన్యాయములు

అనేకార్ధములుగల శబ్దము ప్రయుక్తమై అనేకార్ధములు స్ఫురింపజేయుటలో నాశ్చర్యము లేదుగదా!

ఏకాకినీ ప్రతిజ్ఞా హి ప్రతిజ్ఞాతం న సాధయేత్

కేవలప్రతిజ్ఞామత్రము ప్రతిజ్ఞాతార్ధమును సాధింపవేఱదు. (ప్రతిజ్ఞచేసినంతమాత్రమున అర్ధము సిద్దింపదు)

"నహీ ప్రతిజ్ఞామాత్రేణర్ధసిద్ధి:" "వచ ప్రతిజ్ఞా ప్రతిజ్ఞాతం సాధయతి" అను నవి రెండు నీన్యాయరూపంతరములు.

ఏకా క్రియా ద్వ్యర్ధకరీ

ఒకే పని; రెండు ప్రయోజనములు

యజ్ఞాదులవలన స్వర్గమేకాక రంభాసంభోగము, ఇంద్రప్రీతి, వర్షములు కురియుట, జగక్షేమము మున్నగునతి కూడ కలుగునట్లు.

Two birds at one shot

ఏకా మసిద్ధిం పరిహరతో ద్వితీయాపద్యతే

ఆసిద్ధి అన ద్నయాశయము నెఱవేఱకపోవుట. ఆశ్రయాసిద్ధి, స్వరూపాసిద్ధి, వ్యప్యతాసిద్ధి అని అసిద్ధి మూడు విధములు.

ఓకరకపు అసిద్ధిని ఎట్లో దాటిన వెనువెంటనే రెండవది ఆపాదించినట్లు అని న్యాయముయొక్క అర్ధము.

"అంకుజ్రద్యకర్తృకం శారీ ర్యజన్యత్వాత్" అను స్థలమున "శెరీరీ" అను విశేషణముచే స్వరూపాసిద్ధిని నివృత్తిచేయు బౌద్ధునికి వ్యప్యతాసిద్ధి సంభవించినట్లు.