ఈ పుట అచ్చుదిద్దబడ్డది
275

సంస్కృతన్యాయములు

ఏక మనుసన్దిచ్చతో పరం ప్రచ్యవతే

ఒకవిషయమున నభిసంధి కలిగి నిమగ్నుడై యున్నవానికి రెండవది నశించును.

ఉదా -- సుఖవంతునకు దు:ఖము దు:ఖవంతునకు సుఖము.

ఏమసంబందిదర్శనే న్యసమృన్దిస్మరణం

ఒకేవస్తువును చూచినపుడు అద్దానికి సంబంధించిన మఱొక వస్తువునుగూడ స్మరించుట.

"యధా హస్తిపకదర్శనం హస్తిస్మారకం తధా నద్యాదిజ్ఞానస్య కుశకాళజలతుంబికాజలూకానాం తత్సంబందినాం స్మరణ హేతుత్వమ్"

మావటివానిని జూచుట వానికి సంబందించిన ఏనుగులను గూడ స్మరింపజేయునట్లు నద్యాదిజ్ఞానము తత్సంబంధములగు ఱెల్లు, ఱెల్లుపూవు, నీటిలోని జలగలు చేపలు మున్ంగు వానినిగూడ స్మరింప హేతు వవును.

"ఏకసంబంధిజ్ఞాన మపరసంబంధిస్మారకమ్": "ఏక సంబంధిదర్శన మన్యసంబంధిస్మారకమ్" అను నీరేండును పైన్యాయముయొక్క రూపాంతరములు.

ఏకస్యా ప్యనేరక క్తిసమ్బవా దనేకారెహప్రత్యాయన మవిరుద్దమ్

ఒకవస్తువు అనేకరకముల శక్తులు కలిగియున్నపుడు అది అనేకప్రయోజనములను సాధింప ప్రవర్తించుట విరుద్ధము కానేఱదు.