ఈ పుట అచ్చుదిద్దబడ్డది
274

సంస్కృతన్యాయములు

ఉషోషితస్య వ్యాఘ్రస్యూ పారణం పశుమారణం

వ్యాఘ్రోపవాసన్యాయమును జూడుము. ఉష్ణ ముష్ణేన శీతలం

వేడి వేడిచేత చల్లబడును.

ఋజుమార్గేణ సిధ్యతోముర్ధస్వ వక్రేణ సాధనాయోగ:

తిన్నని మార్గమున సిద్ధించుచుండగా నొకపని క్లిష్టమైన వంకరమార్గముచే సాధింప యత్నిండంబడదు.

"అర్కేచే న్మధు నిందేత కిమర్ధం పర్వతం వ్రజెత్" వలె. ఋణవ్రణకలంకానాం కాలే లోపే భవిష్యతి.

అప్పు, పుండు, నింద ఇవి ఓకప్పుడు (తగిన కాలము చచ్చినపుడు) సమసిపోవును.

ఏకం చిత్తం ద్వయో రేవ కి మసాధ్యమ్:

ఇరువురిమనసు ఒకటైన నసాధ్యమే ముండును?

ఏకదేశవికృత మనస్యవత్

ఒకవస్తువున కొకభగమున వికారము (మార్పు) కలిగినను అది ఆవస్తువే అగునుగాని మఱొండు కానేఱదు.

"శ్వాకర్ణే వాపుచ్చే వాభిడ్నీ శ్వైవ భవతి నాశ్యొన గర్ధభ:' అను న్యాయమువిధమున.

ఏక: పాపాని కురుతే ఫలం ఆభుంక్తే మహాజన:

ఒకడు పాపము చేసిన సంఘమున కంతకును తత్పలము సంభవించును.