ఈ పుట అచ్చుదిద్దబడ్డది
265

సంస్కృతన్యాయములు

అవయవప్రసిద్ధే: సముదాయప్రసిద్ధి ర్బలీయసీ

అవయవసిద్ధార్ధముకన్న సముదాయసిద్ధార్ధముబలవత్తరము. "పకజమ్" అనిన నత్తగుల్లగాక పద్మము అని అర్ధము చెప్పునట్లు.

గౌణముఖ్యయో ర్కుఖ్యే కార్యసంప్రత్యయు" అను పరిభాషవలె.

అవయవా ఏవార్ధవన్తోన సముదాయ:

ఒకవాక్యమందలి అవయవభూతములవు పదము లర్ధవంతములై ఒక అర్ధమును సముదాయము (వక్యము)నకు కలిగించునుగాని ప్రత్యేకముగ సముదాయముయన కొక అర్ధముండదు.

ఈనియమమునే మఱొకవిధముగ గూడ నుడువుదురు. "అవయవార్ధవత్త్వాముదాయార్ధవత్త్వమ్" అని.

అవయవము లర్ధవంతము లయిన సముదాయ మర్ధవంతమవును; లేనిచో నిరర్ధక మవును. అని దీని అర్ధము.

అవశ్యాపేక్షితానపేక్షితయో రపేక్షితం స్మరణీయం

అవసరము, అనవసరము ఐనవానిలో ప్రస్తుతము తన కవసరమైనదానినే కోరుకొనుట శ్రేయస్కరము.

అశక్తా స్తత్పదం గంగుం తతో వొందాం ప్రకుర్వతే

అశక్తా స్తత్పదం గంతుం తతో విందాం ప్రకుర్వతే ఆకాస్తదూరము పోలేనివారు అంతకన్న దూరముననున్న ప్రదేశమును "అబ్బ! దీనిమచ్చమాయ, ఇంకా ఇంతదూర మున్నది" అంటూ విందింతురు.