ఈ పుట ఆమోదించబడ్డది
11
సంస్కృతన్యాయములు
- "ఋజుమార్గేణ సిధ్యతి" అను న్యాయము
- తేలికగానగు పనిని కష్టముచేసికొనుట.
- ఏకదేశవికృతన్యాయము
- ఒకభాగమందు వికారము గలిగినను, అది మఱియొకటి కా దనునట్లు.
- ఏకనాళఫలబాహుళ్యనాయము
- ఒకేకాడను పెక్కుపండ్లు వ్రేలునట్లు.
- కంటకన్యాయము
- ముల్లుతీసికొనుటకు ముల్లే కావలయును.
- "ఛలం ఛలేన వంచయేత్"
- కంబళభోజనన్యాయము
- గొంగళిలో భోజనముచేయుచు వెండ్రుక లేరినట్లు.
- కజ్జలజలజన్యాయము
- కాటుకయు నీళ్లును గలిసిన నీళ్లు నల్లబడవు, కాటుక కఱగదు.
- కణజమూషకన్యాయము
- గాదెక్రింది పందికొక్కు గాదెలోనే జీవించును.
- కతకరేణున్యాయము
- చిల్లగింజ అరుగదీసి బురదనీటిలో గలిపిన ఆగంధమ నీటిని బురద నుండి వేఱుపఱచి తా నదృశ్యమవును.