ఈ పుట అచ్చుదిద్దబడ్డది
260

సంస్కృతన్యాయములు

"యత్తావ దుచ్యతే న చాన్యార్ధం ప్రకృత మన్యార్ధం భవతీ త్యన్యార్ధమపి ప్రకృత మన్యార్ధం భవతి | తన్యధా శాల్యర్ధం కుల్యా: ప్రణీయన్తే తాభ్యశ్చ సానీయం పీయత ఉపస్పృశ్యతేచ శాలయశ్చ భావ్యన్తే."

ఉదా:---చెంబులో తాను త్రాగుటాకై తెచ్చి యుంచు కొనిన యుదకము యితరులకుకూడ నుపయోగించునట్లు. "కుల్యాప్రణయనన్యాయమును, జామాత్రర్ధం శ్రపెతస్యసూపాదే రతిధ్యుపకారకత్వమ్" అను న్యయమును జూడుము.

అపంధానం తు గచ్చస్తం స్జోదరో పి చిముంచతి

తప్పుతోవన పోవునానిని సోదరుడుకూడ వదలివైచును. అపరాద్దేషొ రివ ధానుష్కస్య కంకాడంబర:

భాణము గురి తప్పుచు ఉండు ధనుర్ధరునికి నాగాడంబరమువలె.

"అనిర్లోడితకార్యస్య వాగ్జాలం వాగ్మినో వృధా నిమిత్తా దపరాద్ధేషో ర్ధానుష్క స్యేవ వల్గితమ్". మాఘము.

కార్యశూరుడు కానివాని అధికప్రలాపము వ్యర్ధమని భావము.

"ఒట్టిగొడ్దుకు అఱుపులెక్కువ"(ఆ అఱుపులు కేవలము నిష్ప్రయో;జనములు.)