ఈ పుట ఆమోదించబడ్డది
10
సంస్కృతన్యాయములు
- ఉలూఖలమర్దలన్యాయము
- ఱోలు వెళ్లి మద్దెలతో నన్ను అందఱును కొట్టెదరని మొఱ్ఱపెట్టుకొనగా ని న్నొకవైపుననే కొట్టెదరు; నన్ను రెండువైపులను కొట్టెదరని మద్దెల చెప్పినదట.
- ఉలూఖలశేషన్యాయము
- మొగమోటముగల యల్లుడు అత్తగారు పెట్టిన చలిమిడి తినక ఱోటిలో తల దూర్చి అందు మిగిలినది నాకినట్లు.
- ఉష్ట్రకంటకభక్షణన్యాయము
- లొట్టిపిట్ట ముండ్లకొమ్మలను నోటికి గ్రుచ్చుకొనకుండ భక్షించును.
- ఉష్ట్రలగుడన్యాయము
- ఒంటె తనచే మోయబడు కఱ్ఱలచేతనే తాను దెబ్బలు తినును. మూర్ఖత నీన్యాయము సూచించును.
- ఉష్ట్రశూలన్యాయము
- ఒంటెకు గలశూల రోకళ్ళతోగాని చక్కబడదు.
- "చక్కగాదు లొటిపిటశూల రోకండ్లగాని" నిరం . 2.133
- ఊషరబీజన్యాయము
- చవిటినేలలో విత్తనములు చల్లినట్లు.
- ఊషరవృష్టిన్యాయము
- చవిటినేలను వర్షము గురిసినట్లు.