ఈ పుట అచ్చుదిద్దబడ్డది
253

సంస్కృతన్యాయములు

నాంతరంగోపాధానవిషయత్వమేవతయో ర్న్యాయ్యమ్:' ఏతావారా--ఒకేచోట రెండు విధులు ప్రవర్తించినపుడు ప్రధమప్రవృత్తవిధి పశ్చాత్ర్పవృత్తమవు విధిని బాధించి తా బ్రవర్రించునని న్యాయాశయము.

అంతస్తాపో బహి శ్శీతం

లోపలమంట; పైకి చల్ల దనము. పైకి ఆదరము; లోపల కుట్ర

అంధ్న్యేవాంధలగ్నస్య వినిపత: పదే పదే గ్రుడ్దివానిని ఊతగా గొనిన గ్రుడ్డివడు అడుగడుగున పడుచునే యుండునట్లు.

అంతరేణాపి నిమిత్తకబ్ధం నిమిత్తాధోన్ గమ్యతే

నిమిత్తశబ్ధము ప్;రయోగింపబడకపోయినను నిమిత్తార్ధము గోచచించుచునే యుండును.

"విషము మృత్యువు" అన్నట్లు. విషము మృత్యువునకు నిమిత్తము అని అర్ధము.

అకాలే కృత మకృతం స్యాత్

కానిసమయమున జేయబడినది చేయబడనిది యే అవును. విహితకాలమున విహితకర్మ మాచరింపక అవిహిత కాలమున నయ్యదియే కర్మ మాచరింప గడంగుట నిరర్ధక మవుటయేగాక దానివలన గొంత ప్రత్యవాయము కూడ సంభవింపగలదు.