ఈ పుట అచ్చుదిద్దబడ్డది
245

సంస్కృతన్యాయములు

భస్మన్యాజ్యాహుతిన్యాయము

బూడిదలో నేయి హోమము చేసినట్లు.

అకార్యకరణమున కుద్యుక్తుడవు మూర్ఖునకు బోధించుట నిష్ప్రయోజనము. అని కేవల మాయాసకారణము.

"నోపదేశశ్తేనాసి మూఢో కర్యా న్నివర్తతే శతాంశగ్రసనా త్కేన రాహు ర్వాక్య్తర్నివారిత:? అకార్యవారణోద్యుక్తో మూఢే య: పరిఖద్యతే వాగ్విస్తరో వృధా తస్య భస్మ న్యాజాహుతి ర్యధా."

భాండానుసారిస్నేహవన్న్యాయము

కుండ కంటియున్న నూనెమాదిరి.

నూనెపోసినకుండను ఎంతతోమినను ఇంకకొంచెము నూనె దాని కంటియే యుండునుగాని పూర్తిగ పోదు.

వ్యతిరేకమున నుదాహరణము---

స్వకృతసుకృతఫలోపభోగమునకై చంద్రమండల మధిలో హించినపుణ్యాత్ములు కర్మఫల మనుభవించి స్వల్పకర్మావశేషమాత్రమున నూనెకుండకు నూనె వలె అచటనే నిలువజాలరు. (నూనెకుండకు నూనె అంటియుండునుగాని వారట్లు అచట నిలువజాలక తిరిగి మర్త్యలోకమునకు వత్తురు.)